రేపు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు

గణేష్ నవరాత్రులు ముగిశాయి. రేపు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో..

Update: 2022-09-08 12:57 GMT

గణేష్ నవరాత్రులు ముగిశాయి. రేపు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సహా.. రంగారెడ్డి, మల్కాజిగిరీ జిల్లాల్లోని చెరువుల వద్ద నిమజ్జనాలకు తగు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ వినాయక నిమజ్జనాల కోసం 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా తెలంగాణలోని మూడు జిల్లాల స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మాల్కాజిగిరీ జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేప‌టి ప‌ని దినాన్ని భ‌ర్తీ చేస్తూ న‌వంబ‌ర్‌ 12న సెల‌వు దినాన్ని ప‌ని దినంగా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు రేప‌టి ప‌ని దినాన్ని భ‌ర్తీ చేస్తూ ఎల్లుండి (రెండో శ‌నివారం) త‌ర‌గ‌తులు నిర్వ‌హించేలా ప‌లు పాఠ‌శాల‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి.


 




Tags:    

Similar News