బస్సులు రావడం లేదా.. కారణం ఇదే
రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు
టీఎస్‌ఆర్‌టీసీ విలీన బిల్లు (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడం)పై అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత సంతకం చేస్తానని, ఈ ప్రక్రియకు మరింత సమయం పడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపిన సంగతి తెలిసిందే..!
నేడు బస్సుల బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రెండు గంటలపాటు తెలంగాణ వ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు చేశారు. డిపోల నుంచి బస్సులు కదలలేదు. ఈ రెండు గంటలపాటు బంద్ పాటించనున్నారు. ఉదయం 11 గంటలకు పీవీ మార్గ్ నుంచి రాజ్‌భవన్ వద్దకు వెళ్లి ఆర్టీసీ కార్మికులు ముట్టడి చేస్తామని కార్మికులు తెలిపారు. ఆర్టీసీ విలీన బిల్లుపై తాత్సారం వహించడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చారు.
రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.