కేసీఆర్ పై విజయశాంతి పోటీ చేస్తారా.. ఇదిగో క్లారిటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఎలెక్షన్స్ లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఓటమి భయంతోనే

Update: 2023-08-24 08:25 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఎలెక్షన్స్ లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారని.. కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఎలాంటి దూకుడు లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక పలు పార్టీల నుండి ప్రముఖులు కేసీఆర్ పై పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ తరపున సినీ నటి విజయశాంతి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగుతూ ఉండడంతో.. కామారెడ్డిలో కేసీఆర్ పై విజయశాంతిని బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై విజయశాంతి స్పందించారు. ‘కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత’ అని విజయశాంతి ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News