భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 47.4 అడుగులకు చేరుకుంది.

Update: 2024-07-22 07:04 GMT

భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 47.4 అడుగులకు చేరుకుంది. సుమారు 11.15 లక్షల క్యూసెక్కుల వరద నీరు నమోదు అవుతుందని అధికారులు తెలిపారు. మరికొద్ది సేపట్లో..48 అడుగులకు చరే అవకాశముందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది

కాసేపట్లో....

మరి కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 51.20 అడుగులకు చేరుకుంటుందని సిడబ్ల్యుసి అధికారుల తెలిపారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తే మంచిదని తెలిపారు.


Tags:    

Similar News