నేడు-రేపు భారీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు పలు

Update: 2023-07-14 03:29 GMT

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. హనుమకొండ, జనగాం, వరంగల్, మంచిర్యాల, ములుగు, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 115.4, అశ్వారావుపేటలో 102.4, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 113.2, నిజామాబాద్ జిల్లా నందిపేటలో 86, నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 84.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా రాగల రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాదిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దక్షిణాదిన తమిళనాడులో రాగల రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కర్ణాటక, కేరళలో రాగల మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.


Tags:    

Similar News