రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, అస్మానాబాదు, నిర్మల్, నిర్మల్ , ఆదిలాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈనెల 20 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 20వ తేదీన మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.