షాకింగ్ : లిఫ్ట్ గుంతలో పడి మహిళ మృతి.. వీడియో వైరల్

వెనుక ఉన్న మహిళ ఆ ఘటన చూసి ఖంగుతింది. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు. లిఫ్ట్ గుంతలోకి పడిపోయిన..;

Update: 2022-09-21 11:43 GMT

ఇటీవల తమిళనాడులో ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్న టీచర్ లిఫ్ట్ డోర్లలో ఇరుక్కుపోయి మరణించిన విషయం అందరికే తెలిసిందే. ఆ ఘటన పూర్తిగా మరువకుండానే ఖమ్మంజిల్లాలో అదే తరహా ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ అనూహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ కోసం ఓ మహిళ వేచిచూస్తుంది. ఇంతలో ఆమెకు ఫోన్ కాల్ వస్తుంది. అది మాట్లాడుతూనే లిఫ్ట్ డోర్ అన్ లాక్ అవడంతో లోపలికి వెళ్లేందుకు కాలు పెడుతూ.. గుంతలోకి పడిపోయింది.

వెనుక ఉన్న మహిళ ఆ ఘటన చూసి ఖంగుతింది. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు. లిఫ్ట్ గుంతలోకి పడిపోయిన మహిళ పైకి లిఫ్ట్ వచ్చి ఆగింది. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడే కన్నుమూసింది. మృతురాలు వైరా మండలం గొల్లెనపహాడ్ కు చెందిన ప్రమీలగా గుర్తించారు. కాగా.. లిఫ్ట్ రాకముందే డోర్స్ అన్ లాక్ అవడం మెయింటెనెన్స్ లోపమేనంటూ ప్రమీల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News