హిందూ ధర్మంపై ‘వారసుడి’ వివాదాస్పద వ్యాఖ్యలు..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ హిందూ ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి శనివారం తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌, ఆర్టిస్ట్‌ ్స అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ‘సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిది.;

Update: 2023-09-03 11:35 GMT
Tamilnadu, MK stalin, udayanidhi stalin, malaviya, annamalai, bjp
  • whatsapp icon

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ హిందూ ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి శనివారం తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌, ఆర్టిస్ట్‌ ్స అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ‘సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిది. దానిని వ్యతిరేకిస్తే చాలదు. పూర్తిగా నిర్మూలించాలి’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి.

‘కొన్ని విషయాలను వ్యతిరేకిస్తే చాలదు. పూర్తిగా నిర్మూలించాలి. మనం డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు. పూర్తిగా అరికట్టాలి. అలాగే సనాతన ధర్మాన్ని కూడా అరికట్టాలి’ అన్నారాయన. డీఎంకే హిందుత్వ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ పార్టీ. పెరియార్‌, అన్నా, కరుణానిధి లాంటి వాళ్లు హిందూ ధర్మాలని, పురాణాలను పూర్తిగా వ్యతిరేకించారు. ఆ బాటలోనే స్టాలిన్‌ కూడా ప్రయాణించారు. అతని వారసుడు కూడా నాస్తికత్వాన్నే అనుసరిస్తుండటం గమనార్హం. ఉదయనిధి తమిళ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాత, నటుడు కూడా.

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవియ మంత్రి మాటలపై మండి.పడ్డారు. ‘ఉదయనిధి భారత్‌లో సనాతన ధర్మాన్ని పాటించే ఎనభై శాతం జనాభాను ఉచకోత కోయాలని పిలుపునిస్తున్నారు’ అంటూ ఎక్ప్‌ (ఒకప్పటి ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. కమలం పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కూడా మంత్రి మాటలపై తీవ్రంగా స్పందించారు. ‘క్రిస్టియన్‌ మిషనరీల నుంచి కొనుక్కొచ్చిన ఓ ఆలోచనని ఆయన అనుసరిస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘తమిళనాడు జీడీపీ కంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టటడమే గోపాలపురం (స్టాలిన్‌) కుటుంబం లక్ష్యం. దీనికోసం మిషనరీల ఆలోచనను అనుసరిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘మరోసారి ఇండియా కూటమి తన అసలు ముఖాన్ని బయటపెట్టుకుంది. వాళ్ల భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక విధానాలని కాంగ్రెస్‌కు చెందిన కార్తి చిదంబరం కూడా సమర్ధిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలు డీఎంకేనే కాదు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిని కూడా ఇరుకున పెడుతున్నాయి.

Tags:    

Similar News