ఏబీపై చర్యలకు ప్రభుత్వం రెడీ

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో రాత [more]

Update: 2020-12-19 05:44 GMT

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో రాత పూర్వకమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోరారు. ఏబీ వెంకటేశ్వరావు హయాంలో ఆయుధాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సస్పెండ్ చేసినా ఆయన హైకోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయిందనే చెప్పాలి.

Tags:    

Similar News