వర్మతో ఒరిగేదేంది? తెగేదేముంది?
చర్చలు ముగిసిన తర్వాత వర్మ ఎలాంటి కామెంట్స్ చేస్తారోనన్న టెన్షన్ వైసీపీలో అందరికీ పట్టుకుంది.
రాంగోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు. వ్యక్తి కూడా. విచిత్రమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి. అటువంటి రాంగోపాల్ వర్మతో చర్చలు అంటే అర్థం చేసుకోవచ్చు. మంత్రి పేర్ని నాని కూడా సమర్ధుడే కాని, చర్చలు ముగిసిన తర్వాత వర్మ ఎలాంటి కామెంట్స్ చేస్తారోనన్న టెన్షన్ వైసీపీలో అందరికీ పట్టుకుంది. వర్మకు అసలు అపాయింట్ మెంట్ పేర్ని నాని ఇవ్వాల్సింది కాదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది.
టీవీ ఛానల్ లో....
వర్మ హుందాగా ఉండే వ్యక్తి కూడా కాదు. మూవీ టిక్కెట్ల ధరలను తగ్గించడంపై రాంగోపాల్ వర్మ ఒక టీవీ ఛానల్ లో పది ప్రశ్నలు మంత్రికి సంధించారు. దీనికి పేర్ని నాని సమాధానమిస్తే సరిపోయేది. కానీ కొరివితో తలగోక్కున్నట్లు వర్మతో చర్చలకు పేర్ని నాని సిద్ధపడటంపై పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఏదో జరిగిపోతుందనుకుంటే?
వర్మతో భేటీతో ఏదో జరిగిపోతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై ప్రభుత్వం ఫర్మ్ గా ఉంది. వర్మతో చర్చల తర్వాత ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని భావించడం వృధా. వర్మ కూడా సినీ పరిశ్రమల సమస్యలను సీరియస్ గా తీసుకోరు. ఈ విషయం అందరికీ తెలుసు. దీంతో వర్మతో ఒరిగేదేముంది? తెగేదేముంది? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వర్మకు అసలే మెంటలోడు అన్న పేరుంది. చర్చల తర్వాత వర్మ చేసే కామెంట్స్ పై విపక్షాలు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.