ఓడిపోవడం మంచిదయింది

గత ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిదయిందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తాను ఓడిపోవడం వల్లనే తన వారెవరో? [more]

Update: 2019-10-22 13:52 GMT

గత ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిదయిందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తాను ఓడిపోవడం వల్లనే తన వారెవరో? అవతలి వారెవరో తెలిసి వచ్చిందని ఆఖిలప్రియ ఆవేదన చెందారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిపైనా అక్రమంగా కేసులు పెట్టలేదని అఖిలప్రియ చెప్పారు. పులివెందులకు తాను వెళ్లి వచ్చిన వెంటనే కేసులు పెట్టడం ప్రారంభమయిందన్నారు. జిల్లా ఎస్సీ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు అఖిలప్రియ. తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిలప్రియ హెచ్చరించారు. తన భర్త కులం గురించి మాట్లాడుతున్నారని, వేరే కులం వారిని వివాహం చేసుకున్నందునే తాను ఓటమి పాలయ్యాని వార్తలు సృష్టిస్తున్నారని ఆవేదన చెందారు.

Tags:    

Similar News