సొంతంగా ఎదిగితే అందరికి ఆనందమే ...!

చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరినీ మెగా హీరోలు అని మీడియా అభివర్ణిస్తుంది. చిరంజీవి అండతో హీరోలై టాలీవుడ్‌ను ఏలుతున్న ఆయన వారసుల లిస్ట్‌ పెద్దదే ఉంటుంది. మొదట నాగబాబుతో ఈ ట్రెండ్‌ మొదలైంది. రాక్షసుడు సినిమాలో చిరంజీవి స్నేహితుడిగా నటించిన నాగబాబు, దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి ఓ అరడజను సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూ... సినిమాల్లో, టీవీల్లో బిజీగానే ఉంటున్నాడు. తర్వాత వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ స్టార్‌గా మెగా ఇమేజ్‌ సాధించాడు.

Update: 2023-08-27 06:12 GMT

పుష్పరాజ్ మనసులో మాట ..! 

చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరినీ మెగా హీరోలు అని మీడియా అభివర్ణిస్తుంది. చిరంజీవి అండతో హీరోలై టాలీవుడ్‌ను ఏలుతున్న ఆయన వారసుల లిస్ట్‌ పెద్దదే ఉంటుంది. మొదట నాగబాబుతో ఈ ట్రెండ్‌ మొదలైంది. రాక్షసుడు సినిమాలో చిరంజీవి స్నేహితుడిగా నటించిన నాగబాబు, దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి ఓ అరడజను సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూ... సినిమాల్లో, టీవీల్లో బిజీగానే ఉంటున్నాడు. తర్వాత వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ స్టార్‌గా మెగా ఇమేజ్‌ సాధించాడు.

మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన మరో హీరో అల్లు అర్జున్‌. మొదటి చిత్రంతో తన లుక్కుకి విమర్శలు ఎదుర్కొన్నా తర్వాత స్లైలిష్‌ స్టార్‌గా ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్నాడు. సిక్స్‌ ప్యాక్‌తో యువ హృదయాలను కొల్లగొట్టాడు. భారీ విజయాలను నమోదు చేసుకుని ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో చిరు వారసుడు రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ఇలా అన్ని తేజాలు సినిమా రంగంలో ప్రవేశించి, టాలీవుడ్‌ని ప్రకాశింపజేస్తున్నాయి. చివరకు చిరంజీవి మాజీ రెండో అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కూడా ఓ సినిమా తీసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు, ఈలోగా ‘చిరు’ కూతురితో విడిపోవడంతో అతని సినిమా జీవితానికి ఫుల్‌స్టాప్‌ పడినట్లే.

రామ్‌ చరణ్‌ మాత్రమే టాప్‌ హీరోగా రాణిస్తున్నా ఇప్పటికీ అతను ‘మెగా’ నీడ నుంచి బయటకు రావడం లేదు. ఆ అవసరం కూడా చరణ్‌కి లేదు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, అసలైన వారసుడిగా చలామణి అవుతున్నాడు. అయితే ‘మెగా’ సమస్యంతా అల్లు అర్జున్‌తోనే. మెగా అభిమానుల్లో చాలామంది అల్లు అర్జున్‌ని అభిమానిస్తున్నా.. అల్లు ఆర్మీ అంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ని అతను ఏర్పాటు చేసుకున్నాడు. మెగాస్టార్‌ నీడ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకంటూ ‘సొంతం’ ఉండాలనే లక్ష్యం ఒక కారణం కాగా, చిరంజీవి సినిమాల్లోకి రాకముందు నుంచే తన వంశం సినిమాల్లో ఉండటం మరో కారణం. 1950 నాటి నుంచే అల్లు అర్జున్‌ తాత రామలింగయ్య విలన్‌గా, హాస్య నటుడిగా టాలీవుడ్‌ని ఏలారు. అతని కొడుకు అరవింద్‌ తెలుగులో భారీ ప్రొడ్యూసర్‌.

అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న తర్వాతే చిరంజీవి స్టార్‌గా ఎదిగారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌ చిరంజీవితో తీసిన సినిమాలు అన్నీ దాదాపు సూపర్‌ హిట్లే. చిరంజీవిని ఓ సాదాసీదా హీరో నుంచి టాలీవుడ్‌ నెంబర్‌వన్‌గా మార్చినవే. మెగా నీడ నుంచి అల్లు అర్జున్‌ బయటకు రావడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. ఆదివారం ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ మెగా ఫ్యాన్‌ వార్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే తెలివిగా మాట్లాడాడు. ఆయన మాటలు ఒక్కసారి చదవండి.

‘జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్‌ గడిచాక తనకంటూ ఓ డెవలప్‌మెంట్‌ జరుగుతుంది అది సహజం’

‘ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవెల్‌కు వచ్చాక... వాళ్లు మనదగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది’

‘మనం ఒకరి కంటే తక్కువ ఉన్నప్పుడో, ఇప్పుడు ఎంత ఉన్నామో అంతే ఉంటే.. పేరెంట్స్‌ మనం బయటకు వెళ్లాలని కోరుకోరు. అదే మనం టెన్‌ ఎక్స్‌’ ఎదిగాం అనుకుంటే.. వాళ్లు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. ఇదంతా సైజ్‌ డిఫెరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది’

పై వ్యాఖ్యల ఆధారంగా అల్లు అర్జున్‌ కుండబద్దలు కొట్టి చెబుతున్నది ఒకటే, నేను ఎదిగే క్రమంలో మెగా కాంపౌండ్‌ నుంచి బయటకు వచ్చేశాను. నేను పదిరెట్లు ఎదిగాను కాబట్టి... నేను బయటకు వచ్చినా, నాకంటూ సొంత బేస్‌ ఏర్పాటు చేసుకున్నా చిరంజీవి గారు ఏమీ అనుకోరు. సొంతంగా ఎదిగితే అందరికి ఆనందమే ...!

ఈ విషయాన్ని ఇంత విడమరచి చెప్పకపోయినా... అర్థం కావాల్సిన వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఎంతైనా అల్లు అరవింద్‌ వారసుడు కదా!

Tags:    

Similar News