నాకు నిజమైన స్నేహితుడు

మోదీ తనకు నిజమైన స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొతేరా స్టేడియంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చాయ్ వాలాను ప్రధానిని చేసిన ఘనత [more]

Update: 2020-02-24 08:56 GMT

మోదీ తనకు నిజమైన స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొతేరా స్టేడియంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చాయ్ వాలాను ప్రధానిని చేసిన ఘనత భారత్ కే దక్కుతుందన్నారు. గత ఏడాది అద్భుతమైన మెజారిటీతో మోదీ గెలిచారని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోదీ తన ఫ్రెండ్ అని చెప్పడానికి గర్వ పడుతున్నానని ట్రంప్ అన్నారు. అభివృద్ధి కోసం మోడీ నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అమెరికా భారత్ ను ఎప్పుడూ ప్రేమిస్తుందని చెప్పారు. మొతేరా స్టేడియం చాలా అద్భుతంగా ఉందన్నారు. తమ హృదయాల్లో ఎప్పుడూ భారత్ కు ప్రత్యేక స్థానం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇండియాకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. నమస్తే అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

సినిమాలు.. క్రికెట్…..

యువకుడిగా ఉన్నప్పుడు మోడీ టీ షాపులో పనిచేసిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్య తర్వాత మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలిపారు. మోడీ కఠినంగా ఉన్నా అందరూ ఆయనను ప్రేమిస్తారని ట్రంప్ తెలిపారు. మోడీ గుజరాతీయే కాదని, దేశం మెచ్చిన నేత అని చెప్పారు. భారత్ కు ఉన్న శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివని చెప్పారు ట్రంప్. 1.20 లక్షల మందిని ఒకే చోట చూడటం అద్భుతమన్నారు. ప్రపంచం మొత్తం మీద మోడీ గొప్ప నేతగా ట్రంప్ అభివర్ణించడం విశేషం. షోలే, దిల్ వాలే దుల్హనియా బాలీవుడ్ సినిమాల గురించి ప్రస్తావించారు. డీడీఎల్ సినిమా గురించి మాట్లాడారు. భారతీయులు సంగీతం, సినిమాలు అంటే ఇష్టమని చెప్పారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల పేర్లను తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. మానవత్వానికి భారత్ చిరునామాగా ట్రంప్ చెప్పుకొచ్చారు. భారతీయ హోలీ, దీపావళి పండుగల పేర్లను ట్రంప్ పేర్కొనడంతో స్టేడియం ప్రజల హర్షధ్వనాలతో మారుమోగిపోయింది.

మరింత మెరుగ్గా…..

రెండు దేశాల మధ్య మరింత సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. కొత్త ఒప్పందాలు కుదురుతాయని తెలిపారు. రేపు కీలక ఒప్పందం కుదుర్చుకోబోతున్నామన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు హెలికాప్టర్ కొనుగోలు ఒప్పందాలపై రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇస్లామిక్ టెర్రరిజంను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఐసిస్ ను వంద శాతం అణిచివేశామని, కీలకమైన వారందరినీ హతమార్చామని ట్రంప్ తెలిపారు. ఇండియాకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ తో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుందని ట్రంప్ చెప్పారు. భారతీయులు సాధించగలరడానికి మోడీయే నిదర్ధనమని చెప్పారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని చెప్పారు. భారత్ కు అత్యాధునిక ఆయుధ సంపత్తిని అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ వియ్ లవ్ ఇండియా అంటూ ముగించారు.

Tags:    

Similar News