ట్రంప్ రెండో రోజు ఒప్పందాలపై?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో రెండో రోజు పర్యటన చేస్తున్నారు. ఈరోజు రెండు దేశాల మధ్య వివిధ ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే రెండు రకాల [more]

Update: 2020-02-25 03:39 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో రెండో రోజు పర్యటన చేస్తున్నారు. ఈరోజు రెండు దేశాల మధ్య వివిధ ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే రెండు రకాల హెలికాప్టర్ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నేవీకి రోమియో, ఆర్మీకి అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరగనుంది. హైదరాబాద్ హౌస్ లో ఈరోజు ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. దాదాపు పది బిలియన్ డాలర్ల ఒప్పందాలు రక్షణ శాఖకు సంబంధించి ఇరు దేశాల మధ్య కుదరనున్నాయి. ఇద్దరూ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 1030 గంటలకు రాజఘాట్ కు వెళ్లి ట్రంప్ మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.

Tags:    

Similar News