ఆయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు

Update: 2018-10-12 12:49 GMT

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కు ఒక నివేదిక సమర్పంచింది. తాము ఈ కేసు విచారణ చేసే టైం వరకు ఫైల్స్ మొత్తం విజయవాడ కోర్టు లో ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడే రికార్డులు ధ్వంసమయ్యాయన్న సిట్ పేర్కొంది. దీంతో రికార్డుల ధ్వంసంపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌ ను ఆదేశించింది. పోలీసు విచారణ కంటే సీబీఐ దర్యాప్తు మేలని అభిప్రాయపడింది. సీబీఐని సుమోటో ప్రతివాదిగా చేర్చింది.

Similar News