బెంగళూరుకు ఇదేం బాధ?
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు జలమయమైంది. ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతం పూర్తిగా నీట మునిగింది.;
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు జలమయమైంది. ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఈ నెల 9వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో బెంగళూరు వాసులు హడలి పోతున్నారు. రహదారులు పూర్తిగా నీట మునిగాయి. అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
నీటిలో నానుతున్న...
ఇక కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విల్లాలు కూడా నీట మునిగాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. పడవలతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యుత్తు సరఫరాను కొన్ని ప్రాంతాల్లో అధికారులు నిలిపివేశారు. మంచినీటి సరఫరా కూడా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.