అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా శానససభ్యుల హక్కులను కాలరాశారని, అసెంబ్లీకి ఎటువంటి సమాచారం లేకుండా కేవలం మంత్రివర్గ సమావేశంతో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని వారు కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై శుక్రవారం సుదీర్ఘంగా విచారించిన కోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించి పిటీషన్లను కొట్టి వేసింది.