ఏపీలో ఆ పార్టీ గెలుపు అసాధ్యం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలుపు అసాధ్య‌మ‌ని బీజేపీ సీనియ‌ర్ నేత ముర‌ళీధ‌ర్ రావు జోస్యం చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న ఓ ఛాన‌ల్ తో మాట్లాడుతూ… ఏపీలో [more]

Update: 2019-05-10 07:24 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలుపు అసాధ్య‌మ‌ని బీజేపీ సీనియ‌ర్ నేత ముర‌ళీధ‌ర్ రావు జోస్యం చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న ఓ ఛాన‌ల్ తో మాట్లాడుతూ… ఏపీలో త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతున్నామ‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌లో త‌మ బ‌లాన్ని ప‌దిలం చేసుకున్న‌ట్లు తెలిపారు. త‌మిళ‌నాడులోనూ త‌మ కూట‌మి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల్లో న‌రేంద్ర మోడీ ప‌ట్ల ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, ఢిల్లీలో మోడీనే ఉండాల‌ని ప్ర‌జ‌లు బ‌లంగా కోరుకుంటున్నార‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News