బ్రహ్మోస్ రహస్యాలు పాకిస్థాన్ కు లీక్..?

Update: 2018-10-08 12:54 GMT

భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలు పాకిస్థాన్ కు లీక్ చేస్తున్న ఓ డీఆర్డీఓ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ పూర్ లోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రంలో నిషాంత్ అగర్వాల్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే, పాకిస్థాన్ గుఢచార సంస్థ ఐఎస్ఐ కి అమ్ముడుపోయిన నిషాంత్ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ కు చేరుస్తున్నాడని మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో ఆతడిని ఇవాళ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రష్యా సహకారంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణలు మన దేశ రక్షణ వ్యవస్థలో ఎంతో కీలకం. ఈ క్షిపణులు మన శాస్త్రవేత్తలే తయారుచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్ గా బ్రహ్మోస్ గుర్తింపు పొందింది.

Similar News