సీఎం కు షాకిచ్చిన హైకోర్టు

Update: 2018-10-12 09:44 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాంట్రాక్ట్ కట్టబెట్టిన ఎస్పీకే గ్రూపు చేపట్టిన రోడ్డు పనులపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కంపెనీకి అప్పనంగా ఆరు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టినట్లు డీఎంకే ఆరోపించింది. ఈ మేరకు డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ విచారణతో సీఎం పళనిస్వామికి ఎదురుదెబ్బేనంటున్నారు. ఎస్పీకే గ్రూపుపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీర్పుతో పళనిస్వామికి చుక్కెదురయింది. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సీబీఐకి మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఎస్పీకే గ్రూపు సీఎం బంధువులదేనన్నది డీఎంకే ఆరోపణ.

Similar News