గులాం నబీకి ఫిక్స్ అయిపోయినట్లేనా?

గులాం నబీ ఆజాద్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

Update: 2022-01-26 08:06 GMT

గులాం నబీ ఆజాద్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆయనతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్యకు కూడా పద్మభూషణ్ ను ప్రకటించింది. కానీ భట్టాచార్య ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్ కు పద్మభూషణ్ ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ పురస్కారం ఇచ్చి ఉండవచ్చన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

కాంగ్రెస్ లోనే....
గులాం నబీ ఆజాద్ ఆషామాషీ నేత కాదు. ఆయన ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా నాలుగు దశాబ్దాల పాటు దేశానికి సేవలందించారు. రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ లోనే ప్రారంభించి ప్రస్తుతానికి అందులోనే కొనసాగుతున్నారు. అసంతృప్త నేతగా ఉన్నారు. కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు కావాలన్న డిమాండ్ తో గులాంనబీ ఆజాత్ కొంతకాలం క్రితం 23 మంది నేతలో సోనియా గాంధీకి లేఖ రాసి అధినాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు.
పురస్కారంతో పాటు పదవి కూడానా?
అందుకే ఆయన రాజ్యసభ పదవిని కూడా రెన్యువల్ చేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల్లో ఏదో ఒకటి గులాం నబీ ఆజాద్ కు ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. మైనారిటీల్లో పాపులర్ లీడర్ అయిన గులాం నబీ ఆజాద్ కు పదవి ఇవ్వాలన్న బీజేపీ యోచిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా పద్మభూషణ్ ఇవ్వడంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమేనని కామెంట్స్ వినపడుతున్నాయి. ఆజాద్ కు పద్మ అవార్డు ఇవ్వడంపై కాంగ్రెస్ లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శశిధరూర్, రాజబబ్బర్ వంటి నేతలు అభినందనలు తెలుపుతుంటే, జైరాం రమేష్ మాత్రం ఆజాద్ ను బానిసగా పేర్కొన్నారు.


Tags:    

Similar News