రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. పది ఎయిర్ పోర్టులకు ఒకే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Update: 2024-11-20 06:07 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో ఆరు, తెలంగాణలో నాలుగు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కొత్త విమానాశ్రయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఫీజుబిలిటీ అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు విడుదల చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఉండటంతో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రెండు రాష్ట్రాలకు పది విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. పది నగరాల ప్రజలు వేగవంతమైన ప్రయాణాన్ని అందిపుచ్చుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో...

ఆంధ్రప్రదేశ్ లో కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, ఒంగోలు, తుని పట్టణాల్లో కొత్త ఎయిర్ పోర్టులను నిర్మించాలన్న ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆరు పట్టణాలకు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలను పంపింది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. అయితే ఈ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనువైన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి అధ్యయనం చేయడానికి ఫీజుబిలిటీ స్డీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలి అడుగు పడినట్లయింది.

తెలంగాణలోనూ...

తెలంగాణలోనూ నాలుగు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణకు ఒకే ఒక్క ఎయిర్ పోర్టు మాత్రమే ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. అయితే హైదరాబాద్ తో పాటు కొత్తగా కొత్త కూడెం, మామునూరు, రామగుండంలలో ఎయిర్ పోర్టులను నిర్మించాలని భావిస్తుంది. వరంగల్ ఎయిర్ పోర్టుకు ఇప్పటికే ఎన్ఓసీ సాధించారు. కొద్దిరోజుల్లోనే వరంగల్ వాసుల కల నెరవేరనుంది. వరంగల్ కు ఎయిర్ పోర్ట్ వస్తే మరింత వేగంగా నగరం విస్తరించే అవకాశముందని ఆ ప్రాంత వాసులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు పది ఎయిర్ పోర్టులు నిర్మాణం పూర్తయితే ఈ పది పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.


Tags:    

Similar News