దేశంలో రోజురోజుకు తీవ్రమవుతోన్న మీటూ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మీటూ ఆరోపణలపై విచారణ చేస్తామని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. మీటూ కేసులపై విచారణ జరిపించేందుకు నలుగురు రిటైర్డ్ జడ్జిలతో ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. మీటూలో భాగంగా వచ్చిన ఆరోపణలు అన్నింటిపై కమిటీ విచారించ జరపనుంది. వివిధ రంగాల్లోని మహిళలు వారి కార్యాలయాలు, వృత్తుల్లో పెద్ద మనుషులుగా ఉన్న పలువురు కామాంధుల వల్ల పడ్డ ఇబ్బందులను మీటూ అంటూ బహిర్గతం చేసి గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ ఇది తీవ్రమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.