బాబు చేసిన పనికి రియాక్ట్ అయిన కేంద్రం….!!!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలా కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారో లేదో…వెంటనే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకపోవడం వల్లనే కడప [more]

;

Update: 2018-12-27 13:55 GMT
చంద్రబాబు
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలా కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారో లేదో…వెంటనే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకపోవడం వల్లనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టత రాలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్సు ను ఏర్పాటుచేశామని, టాస్క్ ఫోర్సు ఎన్ని సార్లు కోరినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదని ఆ శాఖ వెల్లడించింది. కనీసం అటవీ, పర్యావరణ అనుమతుల రిపోర్టులు కూడా అందించలేదని, అందువల్లనే కడప స్టీల్ ఫ్యాక్టరీపై తుది నివేదక అందలేదని పేర్కొంది. ఏపీ ప్రజల కు కడప స్టీల్ ఫ్యాక్టరీని అందించడంకోసమే తమ లక్ష్యమని వివరించింది. అయితే నివేదిక అందిన తర్వాతనే ఉన్నతస్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు లో జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వమేనని వివరంచింది.

Tags:    

Similar News