అది కూడా జగన్ వల్లనేనట….!!!
జగన్ ప్రస్తావన లేకుండా ఏ అంశంతోనూ ముడిపెట్టరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. చివరకు హైకోర్టు విభజన కూడా జగన్ కు అనుకూలంగానే జరిగిందన్న సందేహాన్ని వెలిబుచ్చడం సోషల్ [more]
జగన్ ప్రస్తావన లేకుండా ఏ అంశంతోనూ ముడిపెట్టరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. చివరకు హైకోర్టు విభజన కూడా జగన్ కు అనుకూలంగానే జరిగిందన్న సందేహాన్ని వెలిబుచ్చడం సోషల్ [more]
జగన్ ప్రస్తావన లేకుండా ఏ అంశంతోనూ ముడిపెట్టరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. చివరకు హైకోర్టు విభజన కూడా జగన్ కు అనుకూలంగానే జరిగిందన్న సందేహాన్ని వెలిబుచ్చడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైకోర్టును విభజించడంతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని, ఇప్పుడు జగన్ కేసులు మళ్లీ మొదటికి వస్తాయని, అందుకనే హైకోర్టు విభజనను అంత వేగంగా, సమయం ఇవ్వకుండా చేశారని చంద్రబాబు అన్నారు. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే హైకోర్టు విభజన జరిగినట్లుందని అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం జగన్ కేసులు ట్రయల్ దశలో ఉన్నాయని, తీర్పు వచ్చే పరిస్థితుల్లో విభజన కారణంగా ఆలస్యం జరుగుతుందని చెప్పారు. హైకోర్టును విభజించాలని తానే లేఖరాశానని, అయితే ఇంకా ఇక్కడ హైకోర్టు భవనాలు పూర్తి కాకుండానే ఏకపక్షంగా విభజించారని చంద్రబాబు తెలిపారు.