మోడీది ఫ్ర‌స్ట్రేష‌న్‌… గుంటూరులోనూ అదే జ‌రుగుతుంది

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలో ఫ్ర‌స్ట్రేష‌న్ ఎక్కువ‌యి నోరు పారేసుకుంటున్నార‌ని, గుంటూరులోనూ ఆయ‌న త‌న ఫ్ర‌స్ట్రేష‌న్‌ను బ‌య‌ట‌పెడ‌తార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం పార్టీ [more]

Update: 2019-02-09 05:07 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలో ఫ్ర‌స్ట్రేష‌న్ ఎక్కువ‌యి నోరు పారేసుకుంటున్నార‌ని, గుంటూరులోనూ ఆయ‌న త‌న ఫ్ర‌స్ట్రేష‌న్‌ను బ‌య‌ట‌పెడ‌తార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం పార్టీ శ్రేణుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ లో మాట్లాడిన ఆయ‌న విభ‌జ‌న గాయాల‌పై పుండు మీద కారం జ‌ల్లి పైశాచిక ఆనందం పొందుతున్న మోడీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెల‌పాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. దేశ‌మంతా ఈ నిర‌స‌న‌లు తెలియాల‌న్నారు. గాంధీ స్ఫూర్తితో రేపు ఎల్లుండి అంతా ప‌చ్చ చొక్కాలు ధ‌రించి ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌లు తెలియ‌జేయాల‌ని సూచించారు. ప్ర‌ధాని మోడీని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఒక్క మాట కూడా అనడం లేద‌ని, వారిద్ద‌రూ కుమ్మ‌క్క‌య్యార‌ని అన‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

Tags:    

Similar News