చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆవులను కాదని దున్నపోతులను తెచ్చుకున్నారని, పట్టిసీమ నీళ్లు తాగి ఓట్లు వేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యకర్తల సమావేశంలో [more]

;

Update: 2019-08-07 11:47 GMT
నంద్యాల ఫార్ములా
  • whatsapp icon

ఆవులను కాదని దున్నపోతులను తెచ్చుకున్నారని, పట్టిసీమ నీళ్లు తాగి ఓట్లు వేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూస్తూ ఉండలేకపోతున్నామన్నారు. అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. ప్రతి పనిలో పులివెందుల పంచాయతీని చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇసుక లారీలను అక్రమంగా వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News