నేడు టీడీఎల్పీ సమావేశం… ఆన్ లైన్ లోనే?
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 30వ [more]
;
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 30వ [more]
![నేడు టీడీఎల్పీ సమావేశం… ఆన్ లైన్ లోనే? చంద్రబాబు](https://www.telugupost.com/h-upload/old_images/1500x900_1194072-chandrababu-vedeo-new-latest.webp)
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రధానంగా టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకపోవడం, రాష్ట్రంలో ఎస్పీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు జరుగుతుండగం, ఇసుక దోపిడీ, పోలవరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం, నాసిరకం బ్రాండ్ల మద్యం విక్రయాలు వంటి వాటిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.