జగన్ కు ఓనమాలు రావు

నీటిపారుదల శాఖ విషయంలో జగన్ కు ఓనమాలు రావని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను అన్ని నదులు అనుసంధించాలని భావిస్తే, జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. [more]

;

Update: 2019-10-29 07:43 GMT
చంద్రబాబు
  • whatsapp icon

నీటిపారుదల శాఖ విషయంలో జగన్ కు ఓనమాలు రావని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను అన్ని నదులు అనుసంధించాలని భావిస్తే, జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఆలోచన తాను చేసిందేనన్నారు. రైతుల రుణమాఫీ డబ్బులు విడుదల చేసినా జగన్ సర్కార్ తొక్కిపెట్టిందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ తనకు తాను తెలుసుకోడని, ఒకరు చెబితే వినరని చంద్రబాబు అన్నారు. తనకు,కేసీఆర్ కు మాత్రమే అంతా తెలుసుని జగన్ అనుకుంటున్నాడన్నారు. ప్రజలు తిరబడే రోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు జగన్ కు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News