ఒక్క ఓటు వృధా కాకూడదు
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కన్వెన్షన్ సెంటర్ లో జగన్ మాట్లాడారు.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సీకే కన్వెన్షన్ సెంటర్ లో జగన్ మాట్లాడారు. ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను గెలిపించుకుని సామాజిక న్యాయాన్ని సాధించాలని జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు మాక్ పోలింగ్ నిర్వహించి ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటింగ్ పై అవగాహన కల్పిస్తామని జగన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ మాక్ పోలింగ్ లో ఖచ్చితంగా పాల్గొనాలని అన్నారు.
సాదర స్వాగతం..
తొలిసారిగా రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం లభించిందన్నారు. తొలి నుంచి వైసీపీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చాలని కోరారు. ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఓటింగ్ పై అవగాహన పెంచుకుని పోలింగ్ లో పాల్గొనాలని జగన్ కోరారు. అనంతరం ద్రౌపది ముర్ము జగన్ ఇంట్లో జరిగిన తేనేటి విందుకు హాజరయ్యారు. ఆమెకు వైఎస్ భారతి సాదరంగా స్వాగతం పలికారు. జగన్ ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు తిరుపి వెంకటేశ్వరస్వామి ఫొటో, ప్రసాదాన్ని అందచేశారు.