ఫైర్ అవుతున్న శివాజీ

తెలంగాణ పోలీసుల పై సినీనటుడు శివాజీ ఫైరయ్యారు. తనపై లుక్ అవుట్ నోటీసులు ఎందుకు జారీ చేశారని, తనను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎవరినో మెప్పించేందుకే ఇదంతా చేస్తున్నారని [more]

Update: 2019-07-28 03:02 GMT

తెలంగాణ పోలీసుల పై సినీనటుడు శివాజీ ఫైరయ్యారు. తనపై లుక్ అవుట్ నోటీసులు ఎందుకు జారీ చేశారని, తనను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎవరినో మెప్పించేందుకే ఇదంతా చేస్తున్నారని శివాజీ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని శివాజీ చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న కేసులన్నింటిపైనా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తాను ఇప్పటివరకూ యాభై సార్లు అమెరికాకు లీగల్ గా వెళ్లానంటున్నారు శివాజి. తనకు కోర్టులమీద నమ్మకం ఉందని, ఎక్కడికీ పారిపోనని శివాజీ చెబుతున్నారు. కోర్టు చెప్పినా తనను అమెరికాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని, సమాజం తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని శివాజీ తెలిపారు. తనకు మైహోం రామేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News