పార్లమెంటులో తాను నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నందుకే ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. దాడుల వెనక భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందన్నారు. తాను ప్రతి ఏటా ఆదాయపు పన్ను శాఖ చెల్లిస్తున్నామని చెప్పారు. వరుసగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా ఉండేందుకే ఈ ఆదాయపుపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణ అధికారులయితే......
ఢిల్లీలో సీఎం రమేష్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. సాక్షులుగా తెలంగాణ అధికారులను పెడతామని ఐటీ అధికారి చెప్పడంతో సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసు అధికారులను వెంట తీసుకొస్తే తాము అంగీకరించబోమని ఆయన ఫోన్లోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చెప్పారు. అధికారులు కూడా ఫోన్లు ఎవరూ తీసుకుని పోవడానికి వీల్లేదని అన్నారు. ప్రభుత్వం డైరెక్షన్ లోనే ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నందున అధికారులు కూడా ఫోన్లు తన ఇంట్లోకి తీసుకోకపోవడానికి వీల్లేదని, సోదాలకు తాము సహకరిస్తామని సీఎం రమేష్ చెప్పారు.