జర్నలిస్టుపై లైంగిక వేదింపులు... మంత్రి రాజీనామాకు డిమాండ్

Update: 2018-10-10 11:33 GMT

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని లేదా రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంజే అక్బర్ గతంలో ఓ పత్రికలో ఎడిటర్ గా ఉన్నప్పుడు అందులో పనిచేసే మహిళా జర్నలిస్టును లైంగికంగా వేదించారు. #మీటూ లో భాగంగా సదరు జర్నలిస్టు ఎంజే అక్బర్ బాగోతాన్ని భయటపెట్టారు. ఈ విషయంపై ఇంతవరకూ ఆయన స్పందించలేదు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను ఈ విషయమై ప్రశ్నించగా ఆమె కూడా స్పందించలేదు. దీంతో అక్బర్ పై వచ్చిన ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని కాంగ్రెస్ మరో నేత మనీష్ తివారి డిమాండ్ చేశారు. బీజేపీ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంపై స్పందించారు. ఎంజే అక్బర్ పై విచారణ జరిపించాలని ఆమె అన్నారు. ఏ రంగంలోనైనా పవర్ లో ఉన్నవారు ఇటువంటి వాటికి పాల్పడతారని, మీడియా కూడా మినహాయింపు కాదని మేనకా గాంధీ అన్నారు. కాగా, ప్రస్తుతం నైజీరియాలో ఉన్న ఎంజే అక్బర్ ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు.

Similar News