బ్రేకింగ్: ఢిల్లీ చేరిన డేటా చోరీ వ్యవహారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఈ అంశంపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ ఢిల్లీలో [more]

;

Update: 2019-03-08 06:54 GMT
data theft case in telangana
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఈ అంశంపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ అక్రమంగా ఏపీ ప్రజల డేటా చోరీ చేసి టీడీపీ సేవామిత్ర యాప్ లోకి చేర్చిందని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా కలర్ ఫోటోలతో ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉందని, ప్రజల ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఐటీ గ్రిడ్ సంస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags:    

Similar News