ఈ నెల 6న మూగ జీవాలను హతమార్చిన ఘటనపై కంపాసనేట్ సొసైటీ ఫర్ ఏనిమల్స్ సంస్థ ఫిర్యాదుతో పోలీస్ దర్యాప్తును ముమ్మరం చేశారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్కలను చంపి కాల్చివేసిన చోటును పరిశీలించారు..80 నుండి 100కు పైగా కుక్కలను చంపిన టౌన్ షిప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ చేర్ పర్సన్ ప్రవళిక డిమాండ్ చేశారు.
చంపేసి తగులపెట్టారు......
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ సంసృతి టౌన్ షిప్ లో కుక్కల బెడద తట్టుకోలేకనే ఈ పనికి ఒడిగట్టినట్లు సమాచారం. కుక్కలను చంపడానికి ప్రత్యేకంగా కొందరిని తెప్పించి దాదాపు 80 నుండి 100 కు పైగా కుక్కలను అతి దారుణంగా చంపించినట్లు తెలుస్తోంది..సంస్కృతి టౌన్ షిప్ నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా చంపిన కుక్కలను టౌన్ షిప్ వెనుకాల ఉన్న గుడి సమీపంలో కాల్చివేసినట్లు ఆధారాలను పోలీసులు కనిపెట్టారు..కంపాసనేట్ సొసైటీ ఫర్ ఏనిమల్ సంస్థ పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం కుక్కలను తగలబెట్టిన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహిస్తున్నారు.