బ్రేకింగ్ : కీలక నేత గుడ్ బై

తెలంగాణలో అధికార పార్టీకి గట్ట ఎదురుదెబ్బ తగిలింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేనప్పుడు కొనసాగడం వృధా [more]

Update: 2019-07-09 06:31 GMT

తెలంగాణలో అధికార పార్టీకి గట్ట ఎదురుదెబ్బ తగిలింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేనప్పుడు కొనసాగడం వృధా అని ఆయన తెలిపారు. సోమారపు సత్యనారాయణ 2014 ఎన్నికల్లో రామగుండం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది టీఆర్ఎస్ లో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు పార్టీలోని కొందరు నేతలే కారణమని చెప్పారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకండా తనను వేధించారని సోమారపు సత్యనారాయణ తెలిపారు.

Tags:    

Similar News