బీజేపీలోకి పొంగులేటి... ముహూర్తం ఫిక్స్
మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేట ిశ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది
మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేట ిశ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 18వ తేదీన ఆయన తొలుత బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికలలో తనతో పాటు తన అనుచరులకు టిక్కెట్లు కేటాయింపు విషయంలో క్లారిటీ తీసుకున్న తర్వాత బీజేపీలో ఆయన అధికారికంగా చేరతారని తెలుస్తోంది. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరగనుంది. ఆ సభరోజునే పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు పొంగులేట ిశ్రీనివాసరెడ్డి రెడీ అవుతున్నారు. ఈ నెలలోనే బీజేపీలో ఆయన అధికారికంగా చేరే అవకాశాలున్నాయి.
కొంత కాలం నుంచి...
పొంగులేట ిశ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం పార్లమెంటు నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. అన్నింటికి దూరంగా పెట్టారు. తన అనుచరులతో పాటు తనకు కూడా సరైన గౌరవం దక్కడం లేదని పొంగులేటి భావిస్తున్నారు. తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలపై ఇటీవల ఆయన బహిరంగంగానే బరస్ట్ అయ్యారు. దీని తర్వాత ఆయన గన్‌మెన్లను ప్రభుత్వం తొలగించడం కూడా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి కారణంగా చెబుతున్నారు.
ఖచ్చితంగా పోటీ చేస్తానని...
వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని పొంగులేట ిశ్రీనివాసరెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇందుకు మూడు జనరల్ స్థానాల నుంచి తాను పోటీకి దిగే అవకాశముందని, అందులో ఒకటి ఏంటో త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. అంతేకాదు తన అనుచరులు కూడా ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయింది. పొంగులేటిని వదులుకోవడానికే సిద్ధమయింది. అందుకే గన్‌మెన్లను కూడా తగ్గించారంటున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేట ిశ్రీనివాసరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
బీజేపీకీ అవసరమే...
అయితే ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేేసే అవకాశాలున్నాయంటున్నారు. తనకు పట్టున్న నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తానని చెబుతున్నారు. బీజేపీ నాయకత్వం కూడా పొంగులేటి డిమాండ్లకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలమైన నేత అవసరం. అది పొంగులేటి రూపంలో వస్తుంటే కాదనుకోదు. పొంగులేట ిశ్రీనివాసరెడ్డి సామాజికవర్గంగా, ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయన అనుకున్నట్లుగానే ఆయన కోరుకున్న సీటుతో పాటు అనుచరులకు కూడా టిక్కెట్లను కేటాయించే వీలుంది. ఈ నెల 18న జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.