అమెరికాలో కలకలం….తెలుగు విద్యార్థుల అరెస్ట్
అమెరికాలోని ఓ నకిలీ యూనివర్సీటీ కలకలం రేపింది. ఇందులోతెలుగు విద్యార్థులు ఎక్కువ మంది అడ్మిషన్లు పొందారు. దాదాపు 600 మంది భారత్ కు చెందిన విద్యార్థులు నకిలీ [more]
అమెరికాలోని ఓ నకిలీ యూనివర్సీటీ కలకలం రేపింది. ఇందులోతెలుగు విద్యార్థులు ఎక్కువ మంది అడ్మిషన్లు పొందారు. దాదాపు 600 మంది భారత్ కు చెందిన విద్యార్థులు నకిలీ [more]
అమెరికాలోని ఓ నకిలీ యూనివర్సీటీ కలకలం రేపింది. ఇందులోతెలుగు విద్యార్థులు ఎక్కువ మంది అడ్మిషన్లు పొందారు. దాదాపు 600 మంది భారత్ కు చెందిన విద్యార్థులు నకిలీ యూనివర్సిటీలో చిక్కుకుపోయారు. ఈ ఫేక్ యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు, కస్టమ్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ఎనిమిది మంది తెలుగు విద్యార్థులున్నారు. డెట్రాయిట్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ లో అడ్మిషన్ పొంది నకిలీ సర్టిఫికేట్లను పొందారు. ఈ యూనివర్సిటీకి గుర్తింపు కూడా లేదని తేలింది. మొత్తం 200 మంది వరకూ ఈకేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తెలుగువారిలో కె.భరత్, ఎన్.అశ్వంత్, కె.సురేష్ రెడ్డి, కె.ఫణిదీప్, ఆర్.ప్రేమ్ కుమార్, ఎస్.సంతోష్ రెడ్డి, టి.అవినాష్, పి.నవీన్ లు ఉన్నారు.