వరి కుప్పపైనే ప్రాణం వదిలిన రైతన్న
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతన్న పండించిన పంటపైనే ప్రాణం కోల్పోయారు. [more]
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతన్న పండించిన పంటపైనే ప్రాణం కోల్పోయారు. [more]
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతన్న పండించిన పంటపైనే ప్రాణం కోల్పోయారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు పండించిన ధాన్యాన్ని అమ్మడానికి మార్కెట్ కు తీసుకెళ్లారు. అయితే, ఐదురోజులుగా లారీలు, బస్తీల కొరత ఉండటంతో ధాన్యాన్ని అమ్మలేకపోయారు. దీంతో నాలుగురోజులుగా తన ధాన్యానికి అక్కడే ఉంటూ కాపలా కాస్తున్నారు. దీంతో వడదెబ్బ తగిలి ఆయన వరికుప్పపైనే కన్నుమూశారు. దీంతో లక్ష్మాపూర్ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. గోపాల్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అధికారులు, మార్కెట్ కమిటీ మాత్రం లారీల కొరత ఉందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.