యువకుల చేతుల్లో ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్.. మరోసారి వార్తల్లో భజరంగ్ దళ్

పొన్నంపేటలోని సాయిశంకర పాఠశాలలో ముగిసిన ఎనిమిది రోజుల 'శౌర్య శిక్షణ వర్గ' శిక్షణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమానికి

Update: 2022-05-16 08:08 GMT

హిజాబ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య.. ఇలాంటి కథనాలతో కర్ణాటక రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! ముస్లిం వర్గాలు.. హిందూ సంఘాల మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి.

పొన్నంపేటలోని సాయిశంకర పాఠశాలలో ముగిసిన ఎనిమిది రోజుల 'శౌర్య శిక్షణ వర్గ' శిక్షణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎంపి అప్పచ్చు రంజన్, కెజి బోపయ్య, ఎమ్మెల్సీ సుజా కుశలప్ప హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు కూడా ఇక్కడ శిక్షణ పొందారు. 'త్రిశూల దీక్ష' సందర్భంగా త్రిశూలాన్ని పట్టుకోవడమే కాకుండా, ఆయుధాలు కాల్చడంలో శిక్షణ పొందుతున్న వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
సాయిశంకర పాఠశాల అధ్యక్షులు జరు గణపతి మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో గత 10 సంవత్సరాలుగా ప్రశిక్షణ వర్గ శిక్షణ తరగతులకు వినియోగిస్తున్నామన్నారు. ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇవ్వడం గురించి తన దగ్గర సమాచారం లేదన్నారు. పాఠశాల విద్యార్థులకు సెలవు కావడంతో శిక్షణ నిర్వహణకు నిర్వాహకులకు స్థలం ఇచ్చారు. నిర్వాహకులు శిక్షణ తరగతులలో పాల్గొనే వారికి భోజనం, బస తదితర ఏర్పాట్లు చేశారు. అందులో పాఠశాల పాత్ర ఏమీ లేదు. కొన్నేళ్ల క్రితం పాఠశాలలో జాతీయ స్థాయి శిక్షణ కూడా ఇచ్చారు'' అని తెలిపారు.
ఆయుధ శిక్షణను పలువురు నేతలు ఖండించారు. దీన్ని ఖండిస్తూ SDPI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఒక వారం పాటు ఆయుధ శిక్షణకు అనుమతినిచ్చిన పొన్నంపేటలోని పాఠశాలపై ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి BC నగేష్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు.


Tags:    

Similar News