జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా… నేడు కుటుంబ సభ్యులు కోర్టుకు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి [more]
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి [more]
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇటీవల హార్ట్ కు సంబంధించిన ఆపరేషన్ కూడా జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సకు అనుమతిని ఇవ్వాలని కోర్టును ఆశ్రయించనున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తెలిపారు.