స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలివిగో !

ఇప్పుడిప్పుడే పసిడి ధరలు కాస్త దిగివస్తున్నాయి. నిన్న తులం బంగారంపై 400 పెరుగగా..

Update: 2022-05-09 04:05 GMT

న్యూ ఢిల్లీ : రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధప్రభావం బంగారం ధరలపై పడిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల తర్వాత.. బంగారం ధర భారీగా పెరిగింది. ఇప్పుడిప్పుడే పసిడి ధరలు కాస్త దిగివస్తున్నాయి. నిన్న తులం బంగారంపై 400 పెరుగగా.. నేడు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారట్ , 22 క్యారట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,200 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.51,710 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా స్థిరంగా కొనసాగుతోంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 51,710వద్ద కొనసాగుతోంది. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,800గా ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో రూ.62,500, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, విజయవాడలలో కిలో వెండి ధర రూ.66,800 గా ఉంది.


Tags:    

Similar News