నా సంగతి సరే… వాళ్ల సంగతి చూడండి
సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా ఆలోచనను విరమింప చేయడానికి టీడీపీ హైకమాండ్ ఒక బృందాన్ని పంపింది. అయితే ఆ బృందానికి కూడా గోరంట్ల బుచ్చయ్య [more]
;
సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా ఆలోచనను విరమింప చేయడానికి టీడీపీ హైకమాండ్ ఒక బృందాన్ని పంపింది. అయితే ఆ బృందానికి కూడా గోరంట్ల బుచ్చయ్య [more]
సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా ఆలోచనను విరమింప చేయడానికి టీడీపీ హైకమాండ్ ఒక బృందాన్ని పంపింది. అయితే ఆ బృందానికి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వైఖరి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజమండ్రిలో పార్టీ బాగు పడాలంటే అందరినీ కలుపుకుని పోవాలని ఆయన అన్నట్లు సమాచారం. ప్రధానంగా ఆదిరెడ్డి అప్పారావు వైఖరి పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన విషయాన్ని పక్కన పెట్టి వీరందరినీ కలసి పార్టీ పరిస్థితిని వాకబు చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని పేర్లను ఆ బృందానికి ఇచ్చినట్లు తెలిసింది. తాను మాత్రం ఇక రాజకీయాల్లో ఉండదలచుకోలేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ హైకమాండ్ పంపిన బృందంలో చినరాజప్ప, గద్దె రామ్మోహన్, జవహర్ ఉన్నారు.