గోరంట్ల రాజీనామా నేడే…?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో నేడు స్పష్టత ఇవ్వనున్నారు. గోరంట్ల [more]
;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో నేడు స్పష్టత ఇవ్వనున్నారు. గోరంట్ల [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో నేడు స్పష్టత ఇవ్వనున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారం రోజుల క్రితం పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు త్రీమెన్ కమిటీని నియమించింది. చంద్రబాబుతో కూడా గోరంట్ల భేటీ కాలేదు. చంద్రబాబు ఫోన్ చేసినా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లిఫ్ట్ చేయలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ముందు అన్నట్లుగానే ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు.