ఇంటికే పరిమితమైన బుచ్చయ్య
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఇంటికే పరిమితమయ్యారు. తెలుగుదేశం అధిష్టానంపై [more]
;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఇంటికే పరిమితమయ్యారు. తెలుగుదేశం అధిష్టానంపై [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఇంటికే పరిమితమయ్యారు. తెలుగుదేశం అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న బుచ్చయ్య చౌదరి రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ వచ్చి బుచ్చయ్య చౌదరితో చర్చలు జరిపింది. తన డిమాండ్లను, సమస్యలను కమిటీ ముందు బుచ్చయ్య చౌదరి ఉంచారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై అధినాయకత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతోనే బుచ్చయ్య చౌదరి ఆరోగ్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారంటున్నారు. ఎవరు వచ్చినా బుచ్చయ్య చౌదరి విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పి పంపిస్తున్నారు. నిజానికి ఈ నెల 25వ తేదీనే బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయాలనుకున్నారు.