తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ పై తప్పుడు కథనాలు ప్రచురితం చేశారనే ఆరోపణలపై తమిళ జర్నలిస్టు నక్కిరన్ గోపాల్ పై పోలీసులు రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయితే, ఆయనను రిమాండ్ కు తరలించడానికి హైకోర్టు నిరాకరించింది. రాజద్రోహం కేసు నమోదు చేయడాన్ని కూడా తప్పు పట్టింది. తమిళనాడులో ప్రొఫెసర్ నిర్మాలాదేవి విద్యార్థినులను వ్యభిచార రొంపిలోకి దింపుతోందని, గవర్నర్ వద్దకు కూడా ఆమె విద్యార్థినులను తీసుకెళ్లిందని గోపాల్ తాను ఎడిటర్ గా ఉన్న ‘నక్కీరన్’ అనే పత్రికలో సంచలన కథనం ప్రచురించారు. ఈ ఆరోపణలను అప్పుడే గవర్నర్ ఖండించారు. ఇక అనుచిత కథనంతో రాజ్ భవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా ధర్యాప్తు అధికారిని కూడా నియమించారు. దీంతో జర్నలిస్టు గోపాల్ పై రాజద్రోహం కేసు పెట్టిన పోలీసులు ఇవాళ ఉదయం ఆయన పూణె వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు రాగా అక్కడే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఆయనను రిమాండ్ కు తరలించడానికి కోర్టు నిరాకరించింది.