అన్నీ గమనిస్తున్నా.. కఠినంగా వ్యవహరిస్తా..!

తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై గురువారం అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, గవర్నర్ [more]

Update: 2019-04-25 11:54 GMT

తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై గురువారం అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, గవర్నర్ నరసింహన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తాము రాజకీయం చేయడానికి రాలేదని, పిల్లలు చనిపోతున్నారనే మానవత్వంతో వచ్చామని, మీ వద్ద ఉన్న అస్త్రాన్ని బయటకు తీయాలని షబ్బీర్ అలీ.. గవర్నర్ ను కోరారు. అయితే, తన వద్ద అస్త్రాలేవీ లేవని, కేవలం కలం మాత్రమే ఉందని గవర్నర్ బదులిచ్చారు. తల్లిదండ్రులు పడుతున్న బాధను రాజ్ భవన్ అయినా తీర్చాలనే ఆశతో వచ్చామని గవర్నర్ తో చెప్పారు. చిన్న పిల్లలు చనిపోతున్నారని, కాబట్టి చర్యలు తీసుకోవాలని షబ్బీర్ కోరారు. తాను అన్ని విషయాలూ గమనిస్తున్నానని, అయితే, అభిప్రాయం బయటకు చెప్పలేనని, కఠినంగా వ్యవహరిస్తానని గవర్నర్ కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News