బ్రేకింగ్ : తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ నాగిరెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం రాష్ట్రంలోని 12,732 గ్రామ పంచాయితీలు, [more]
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ నాగిరెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం రాష్ట్రంలోని 12,732 గ్రామ పంచాయితీలు, [more]
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ నాగిరెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం రాష్ట్రంలోని 12,732 గ్రామ పంచాయితీలు, 1,13,1790 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 19 నవంబర్ నాటికి 1,49,52058 మంది ఓటర్లు గ్రామ పంచాయితీల్లో ఉన్నారని ఆయన తెలిపారు. మూడు విడతల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత జనవరి 21న మొదటి విడత, జనవరి 25న రెండో విడత, 30వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 4,480 గ్రామ పంచాయితీ ఎన్నికలకు, 39,832 వార్డులకు, రెండో విడతలో 4,137 గ్రామ పంచాయితీలకు, 36,620 వార్డులకు, మూడో విడతలో 4,115 గ్రామాలు, 36718 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు
ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని, మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.2 వేలు, రిజర్వుడ్ అభ్యర్థులు రూ.1 వేలు డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వార్డు మెంబర్లుగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.500, రిజర్వుడ్ అభ్యర్థులు రూ.250 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇవాళటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.