కాంగ్రెస్ ముసుగుతో చంద్రబాబు వస్తున్నారు

Update: 2018-10-09 09:02 GMT

తెలంగాణ అభివృద్ధిని అడుగుడుగునా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని టీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2009లో తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబుతో లేఖ ఇప్పించాకనే షరతులతో కూడిన పొత్తును తాము టీడీపీతో పెట్టుకున్నామని, మరి ఇప్పుడు ఏ షరతులతో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన 12 ప్రశ్నలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో టీడీపీ లేదు గనుకే కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు వస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై ఆధారపడ్డ కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు ఆగిపోతాయని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అమరావతికో, ఢిల్లీకో గులాంగిరి చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

Similar News