ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును స్వతంత్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేంద్రం నివేదిక సమర్పించాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ కేంద్ర హోంశాఖ సీల్డ్ కవర్ లో వారి నివేదికను కోర్టుకు సమర్పించింది. ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరిలో 4లోగా ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అంశాన్ని తేల్చాలని చెప్పిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును కేంద్రానికి బదిలీ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం విచారించినా ఛార్జ్ షీట్ మాత్రం వేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.